హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

ELR: తల్లాపురం యూపీ పాఠశాల ప్రధాన గేటు ముందే రహదారిపై భారీ గొయ్యి ప్రమాదకరంగా మారింది. స్కూల్ కు వచ్చే చిన్నారులు, ఉపాధ్యాయులు ఈ గొయ్యి వల్ల నిత్యం భయంతో రాకపోకలు సాగిస్తున్నారు. వర్షం వస్తే గొయ్యి నిండా నీరు చేరి లోతు తెలియక పిల్లలు పడిపోయే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి గొయ్యిని పోర్చాలని విద్యార్థులు కోరారు.