హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా LIC వారోత్సవాలు

PLD: నరసరావుపేట LIC కార్యాలయంలో 71వ సంస్థ వారోత్సవాలను బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు దేశవ్యాప్తంగా బీమా వారోత్సవాలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. 70 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 71వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నట్లు తెలిపారు.