హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్ క్రికెట్ పతనానికి ఆ ఇద్దరే కారణం: మాజీ బ్యాటర్

పాకిస్థాన్ క్రికెట్ పతనానికి షాహీన్ షా అఫ్రిది, బాబర్ అజామ్ మధ్య తలెత్తిన విభేదాలే కారణమని ఆ దేశ మాజీ బ్యాటర్ బాసిత్ అలీ ఆరోపించాడు. కెప్టెన్సీ విషయంలో వీరిద్దరి మధ్య చెలరేగిన వివాదమే జాతీయ జట్టు ప్రస్తుత దుస్థితికి, క్షీణతకు ప్రధాన నాంది పలికిందని ఆయన అభిప్రాయపడ్డాడు.