హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఈనెల 6న కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

WGL: కాశిబుగ్గలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో సెప్టెంబర్‌ 6న దశమి తిథి, ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకుడు రాజన్‌కుమార్‌ తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు సహస్ర లింగానికి పంచామృత అభిషేకం, గోమతి చక్రాలతో సహస్రనామార్చన, విశేష అలంకరణ, మహాహారతి నిర్వహించనున్నారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావాలన్నారు.