హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మున్సిపల్ వైస్ ఛైర్మన్

KMM: మధిర పట్టణంలోని 18వ డివిజన్‌లో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు పనులను మంగళవారం మున్సిపల్ వైస్ ఛైర్మన్ కోన ధని కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేపట్టాలన్నారు.