NLG: దేవరకొండలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, కలెక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ పాల్గొని నూతనంగా ఎంపికైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవుతాయన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


