హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాయత్రీనగర్‌లో కమిషనర్ శ్రీజన పర్యటన

HYD: ‘వన్ వార్డ్ ఎవరీ డే’లో భాగంగా సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ గుమ్మల్ల శ్రీజన గాయత్రీనగర్ వార్డులో పర్యటించారు. రోడ్లు, యూజీడీ, నాలాలు, వీధిలైట్లు, పారిశుధ్యం, దోమల నియంత్రణ, నీటి సమస్యలను స్థానికులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కైత్లాపూర్ ఎక్స్‌రోడ్‌ ట్రాఫిక్ సమస్యపైనా చర్చించారు. సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.