సిన్సినాటి ఓపెన్ తొలి రౌండ్ ఓటమి యూఎస్ ఓపెన్‌కు సన్నద్ధం కావడానికి తనకు మేలు చేసిందని టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ తెలిపాడు. రెండు వారాల సమయం దొరకడంతో శరీరాన్ని, మనసును సిద్ధం చేసుకున్నానన్నాడు. 25వ గ్రాండ్‌స్లామ్ లక్ష్యంగా నాలుగో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఈ ఏడాది కేవలం 16 టోర్నీలే ఆడిన అతను, టాప్-95లో అత్యల్ప టోర్నీలు ఆడిన ఆటగాడిగా నిలిచాడు.
క్రీడలు
ఆ ఓటమి నాకు మేలు చేసింది: జకోవిచ్


