హైదరాబాద్: 28°C
క్రీడలు

తిలక్ వర్మ టాటూల వెనుక అసలు కారణాలివే?

టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ టాటూలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. శివుడు, గణేశుడి చిత్రాలతో పాటు ‘ఓం నమః శివాయ్’, ‘Unwavering Self Trust’ అనే పదాలు ఆయన చేతిపై ఉన్నాయి. తన ఆధ్యాత్మిక విశ్వాసాన్ని ప్రతిబింబించేలా వీటిని వేయించుకున్నారు. అలాగే తన పెంపుడు కుక్క ట్రిగ్గర్ జ్ఞాపకార్థం దాని చిత్రాన్ని కూడా టాటూగా వేయించుకున్నారు.