TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడ్డ డ్రైవర్ సుందర్‌రావుకు రూ.6వేల జరిమానా విధించింది. అంతేకాకుండా ఒక రోజు రోడ్డుపై నిలబడి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. యాచారం పోలీసులు కోర్టు ఆదేశాలతో అతడితో ట్రాఫిక్ డ్యూటీ చేయించారు.
వార్తలు
డ్రంక్ డ్రైవింగ్‌కు వినూత్న శిక్ష


