హైదరాబాద్: 28°C
క్రీడలు

మెస్సీని GOAT అని ఎందుకు పిలుస్తారు?

లియోనెల్ మెస్సీని ఫుట్‌బాల్ అభిమానులు GOAT అంటే ‘Greatest of All Time’గా పిలుస్తారు. అద్భుతమైన డ్రిబ్లింగ్, గోల్స్, అసిస్ట్‌లు, పాసింగ్‌తో మెస్సీ ప్రత్యేక గుర్తింపు పొందాడు. బార్సిలోనా తరఫున ఎన్నో టైటిళ్లు గెలిచిన ఆయన.. అర్జెంటీనాకు 2022 ప్రపంచకప్ అందించాడు. ఎనిమిది బాలన్ డి’ఓర్ అవార్డులు కూడా అతడు గొప్పతనానికి నిదర్శనంగా నిలిచాయి.