హైదరాబాద్: 28°C
వార్తలు

స్కూలుకు కంప్యూటర్లను బహుకరణ

BPT: కొడవలివారిపాలెం ZP హైస్కూల్‌కు పూర్వ విద్యార్థుల తరఫున కొడాలి కార్తీక్ రూ. 50,000 విలువైన కంప్యూటర్లను బహుకరించారు. హెచ్‌ఎం ఉమామహేశ్వరరావు 'విద్యాంజలి 2.0' పోర్టల్ ద్వారా దాతకు సర్టిఫికేట్ అందించి అభినందించారు. ఈ కంప్యూటర్లు విద్యార్థుల డిజిటల్ విద్యకు ఎంతో దోహదపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.