హైదరాబాద్: 28°C
క్రీడలు

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం

ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయిన పాకిస్తాన్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. వరుస పరాజయాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న పీసీబీ.. రెడ్‌బాల్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని భావిస్తోంది. అతడి స్థానంలో ఇప్పటికే వైట్‌బాల్ కోచ్‌గా ఉన్న మైక్ హసన్‌కే టెస్టు బాధ్యతలు కూడా అప్పగించాలని పీసీబీ యోచిస్తోంది.