హైదరాబాద్: 28°C
క్రీడలు

స్టార్ క్రికెటర్‌కు గాయం

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ గాయపడ్డాడు. BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్.. పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా శిక్షణ సమయంలో అతని కాలికి కొత్తగా గాయమైందట. దీంతో అతని రీఎంట్రీపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ గాయంతో తదుపరి సిరీస్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.