AP: బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు 'సేవా సంకల్ప ఉత్సవాలు' నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. ఈ ఉత్సవాల కార్యశాలకు ఆయనతో పాటు మంత్రి సత్యకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, ప్రతి పథకం చివరి వ్యక్తికి చేరేలా అనేక ఆవిష్కరణలు చేశారని కొనియాడారు.
వార్తలు
మోదీ దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు: మాధవ్


