హైదరాబాద్: 28°C
వార్తలు

51 మంది భారతీయులు మృతి

రష్యా సైన్యంలో 227 మంది భారతీయులు చేరగా, వారిలో 51 మంది మరణించారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు. ప్రధాని మోదీ కిర్గిస్థాన్ పర్యటన సందర్భంగా ఈ వివరాలు వెల్లడించారు. 139 మందిని రష్యా సైన్యం డిశ్చార్జ్ చేసిందని, మిగిలిన వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు ఆ దేశంతో నిరంతరం చర్చిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.