హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌ జీడీపీ వృద్ధిరేటు శుభసూచకం: సీతారామన్‌

భారత దేశ జీడీపీ వృద్ధిరేటు అంచనాలను మించి నమోదు కావడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్నప్పటికీ, భారత్ మాత్రం స్థిరమైన వృద్ధిని కనబరుస్తోందని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుందని సంతోషం వ్యక్తం చేశారు.