అన్నమయ్య: వీరబల్లి మండలం వంగిమళ్ల పెద్దూరులో దెబ్బతిన్న రహదారిని కువైట్ నుంచి వచ్చిన షేక్ నౌషద్ అలీ సొంత ఖర్చులతో బాగు చేయించారు. జేసీబీ, ట్రాక్టర్లతో ఎర్రమట్టి తరలించి గుంతలను పూడ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ఆయన ముందుకొచ్చి చేసిన సేవపై గ్రామస్తులు అభినందనలు తెలిపారు. అధికారులు స్పందించని వేళ నౌషద్ అలీ సేవాభావం ప్రశంసనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీమంతుడిలా ముందుకొచ్చిన యువకుడు


