హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గొడ్డలితో దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు

SRCL: తంగళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం మత్తులో ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసినట్లు సమాచారం. మామిడాల రాజు అనే వ్యక్తి.. మోతే రాజుపై గొడ్డలితో నరికినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మోతే రాజుకు తీవ్ర రక్తగాయాలు కావడంతో 108 అంబులెన్స్‌ ద్వారా స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.