హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిరిపురంలో వీధి కుక్కల బెడద

SRPT: నడిగూడెం మండలం సిరిపురంలో వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగింది. గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. బాటసారులు, పశువులపై దాడులు చేస్తున్నాయి. రహదారులపై కుక్కల సంచారంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.