హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మైనార్టీ బాలుర పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

SRCL: వేములవాడ, గుడి చెరువు సమీపంలోని మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. డైనింగ్ హాల్ పరిశీలించి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ప్రత్యేక తరగతుల్లో చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి ప్రణాళికతో చదివి లక్ష్యాలు సాధించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.