హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిరీష హత్యను నిరసిస్తూ కొత్తగూడలో కొవ్వొత్తుల ర్యాలీ

MHBD: ఆదివాసీ యువతి ఊకే శిరీష హత్యను నిరసిస్తూ సోమవారం కొత్తగూడ మండల కేంద్రంలో ప్రజా, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శిరీష హత్య కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఆడబిడ్డలకు ఇలాంటి అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.