హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఆవులను రోడ్లపైకి వదిలితే చర్యలు'

కోనసీమ: కాట్రేనికోన మండలంలో ఇటీవల ఆవులు ఇష్టారాజ్యంగా రోడ్లపై సంచరిస్తూ ప్రయాణికులపై దాడులు చేస్తున్నాయని, వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని స్థానిక వ్యాపారులు పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు స్పందించి గ్రామంలో ఆటోతో అనౌన్స్ మెంట్ నిర్వహించారు. ఆవులు రోడ్లపైకి వదిలితే సంబంధిత యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు.