హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీహెచ్ఎంసీ కొత్త లోగో ఆవిష్కరించిన సీఎం

HYD: దాదాపు పదేళ్ల తర్వాత గ్రేటర్ HYD మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)తో పాటు కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్, మల్కాజ్గరి మున్సిపల్ కార్పొరేషన్ల కొత్త లోగోలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 'న్యూ ఐడెంటిటీ, న్యూ డెస్టినీ, న్యూ లోగో' నినాదంతో ఈ సరికొత్త లోగోలను తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాంత అభివృద్ధిలో ఇవి కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని భావిస్తున్నారు.