హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టెంబర్ 3న సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలు

SRD: సంగారెడ్డి కలెక్టరేట్‌లో సెప్టెంబర్ 3న సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఖిలేష్‌రెడ్డి తెలిపారు. మొత్తం 19 రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా గుర్తింపు కార్డుతో హాజరై పోటీల్లో పాల్గొనాలని సూచించారు.