హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వెలగతోడు పైడితల్లి జాతరకు పటిష్ట బందోబస్తు'

కోనసీమ: మండపేట మండలం వెలగతోడు గ్రామంలో సెప్టెంబర్ 1న పైడితల్లి అమ్మవారి జాతర జరగనుంది. జాతర ఏర్పాట్లపై సీఐ దొరరాజు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.