హైదరాబాద్: 28°C
వ్యాపారం

VIDEO: అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రైతులు

NGKL: కొల్లాపూర్ మండలం తాళ్ల నరసింహపురం వాగులో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను స్థానిక రైతులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. అక్రమ ఇసుక తవ్వకాలతో బోర్లు, బావులు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అండతో ఇసుక అక్రమ రవాణాకు తరలిపోయిన మాఫియా రెచ్చిపోతున్నారని రైతులు ఆరోపించారు.