టాటా విద్యుత్ వాణిజ్య వాహనాలకు కూడా మార్కెట్లో బలమైన గిరాకీ ఉందని టాటా మోటార్స్ ఎండీ గిరీష్ వాఘ్ తెలిపారు. చైనా నుంచి బ్యాటరీ సెల్స్ సరఫరాలో ఆటంకాల వల్ల తమ 'ఇంట్రా ఈవీ'పై ప్రభావం పడిందని, సెప్టెంబరు నాటికి ఈ సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 3,400కు పైగా విద్యుత్ వాణిజ్య వాహనాలకు ఆర్డర్లు లభించినట్లు ఆయన వెల్లడించారు.
వ్యాపారం
టాటా కమర్షియల్ ఈవీలకు భారీ గిరాకీ


