హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి'

ASR: కొయ్యూరు మండలం తీగలమెట్ట, బట్టపణుకుల, కాట్రగెడ్డ, బీ.కొత్తూరు, పాడి, రత్నంపేట గ్రామాల్లో సీఐ బీ.శ్రీనివాసరావు పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు. గంజాయి సాగు, రవాణా చేయడం చట్టరీత్యా పెద్ద నేరమన్నారు. గంజాయి, డ్రగ్స్ తదితర మాదకద్రవ్యాలకు, నాటుసారా తయారీ, క్రయ విక్రయాలకు దూరంగా ఉండాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.