హైదరాబాద్: 28°C
వ్యాపారం

లోన్ EMI కట్టకపోతే ఏమవుతుంది?

రుణంపై ప్రతి నెలా చెల్లించే EMI మిస్ అయిన వెంటనే ఆ అకౌంట్ నిరర్థక ఆస్తి(NPA)గా మారిపోదు. EMI గడువు దాటిన వెంటనే ఆ మొత్తాన్ని ఓవర్‌డ్యూగా పరిగణిస్తారు. RBI నియమాల ప్రకారం బకాయిలు 90 రోజులకు మించి చెల్లించకుండా ఉంటే, లేదా వరుసగా మూడు EMIలు కట్టకపోతే మాత్రమే ఆ ఖాతాను NPAగా వర్గీకరిస్తారు. ఒక EMI మిస్ అయితే ముందుగా బ్యాంకులు SMS, మెయిల్ ద్వారా అలర్ట్ చేస్తాయి.