హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయురాలు ప్రమీలకు ఘన సన్మానం

SRPT: నడిగూడెం మండలం రత్నవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోషల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కొల్లు ప్రమీల వెంకట్రావుకు సోమవారం అభినందన సభ నిర్వహించారు. ఎంఈఓ వనం సత్యనారాయణ మాట్లాడుతూ విద్యారంగానికి నాలుగు దశాబ్దాలుగా ఆమె అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించారు.