హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్‌ స్వాధీనం

BDK: దమ్మపేట మండలం పాల్వంచ అటవీ డివిజన్‌ పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై అటవీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పాలగూడెం నుంచి తిరుమలకుంటకు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న వాహనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి తెలిపారు.