CTR: పుంగనూరు పట్టణంలోని 20, 23, 24వ వార్డుల్లో సీఐ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఎస్సై కె.వి. రమణ మాదకద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను విక్రయించినా, సేవించినా చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని, పట్టణంలో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
మాదకద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై


