హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసమానతల నిర్మూలనకు విద్యే మార్గం: అదనపు కలెక్టర్

SRD: ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు విద్యే ఏకైక మార్గమని అదనపు కలెక్టర్ పాండు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో సంచార, విముక్త జాతుల విముక్తి దినోత్సవం నిర్వహించారు. కుల, ఆర్థిక భేదాలు లేకుండా ప్రతి బిడ్డ చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా, సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.