హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనధికార డయాగ్నస్టిక్ ల్యాబ్‌లపై ఆరోపణలు

WGL: నర్సంపేట పట్టణంలో అనుమతులు లేకుండానే కొన్ని డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాథాలజిస్టుల పర్యవేక్షణ లేకుండా పరీక్షలు నిర్వహించి రిపోర్టులు ఇస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ల్యాబ్‌ల అనుమతులు, సిబ్బంది అర్హతలు, నిబంధనల అమలుపై వైద్యాధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.