హైదరాబాద్: 28°C
వార్తలు

భూ సర్వే కోసం కారంచేడు PGRSకు అర్జీలు

BPT: కారంచేడు MRO కార్యాలయంలో సోమవారం MRO మాధవిలత ఆధ్వర్యంలో PGRS, రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MPDO నేతాజితో పాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. భూ సర్వేకు సంబంధించి 2 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వచ్చిన వినతులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సిబ్బందిని MRO ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.