హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనింగ్‌ పనులు నిలిపివేయాలని నిరసన

HNK: నడికుడ మండలంలోని కంటాత్మకూర్‌ గ్రామ సాకల గుట్ట వద్ద చేపడుతున్న మైనింగ్‌ పనులను వెంటనే నిలిపివేయాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. సోమవారం సర్పంచ్‌ ఆధ్వర్యంలో మైనింగ్‌ పనులను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. మైనింగ్‌ కొనసాగితే పర్యావరణానికి, గ్రామానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఉపసర్పంచ్‌, రజక సంఘం ప్రతినిధులు, పాల్గొన్నారు.