హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుండెపోటుతో నిర్వాసితురాలు మృతి

ప్రకాశం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన పెద్దారవీడు మండలం కలనూతలకు చెందిన నిర్వాసితురాలు గోతం రోశమ్మ గుండెపోటుతో మృతి చెందారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆమె మరణించినట్లు సమాచారం. తరతరాలుగా నివసిస్తున్న తమకు పరిహార జాబితాలో పేరు లేకపోవడంపై గ్రామీణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.