హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇరగవరం మండలంలో 240 పోలింగ్ స్టేషన్లు

W.G: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇరగవరం మండలంలోని పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను సోమవారం ప్రకటించినట్లు ఎంపీడీఓ ఏ.శ్రీనివాసు తెలిపారు. మండలంలోని మొత్తం 21 గ్రామ పంచాయతీల పరిధిలో 240 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు తుది జాబితాను ఆగస్టు 31న అధికారికంగా ప్రకటించినట్లు తెలిపారు.