హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలుగోడు ముట్టడికి అనుమతి నిరాకరణ

నంద్యాల జిల్లాలో వాటర్ టెన్షన్ కొనసాగుతోంది. వెలుగోడు ముట్టడికి  వైసీపీ తలపెట్టిన కార్యక్రమానికి అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందని... రిజర్వాయర్ దగ్గరకు ఎవరూ రావొద్దన్నారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి సమాచారం అందించామన్నారు. కాగా.. రేపు రిజర్వాయర్ ముట్టడికి 500 ట్రాక్టర్లతో తరలిరావాలని వైసీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.