హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: కలెక్టర్

NRPT: ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు అంకితభావంతో అందించే సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కలెక్టర్ ప్రియాంక అన్నారు. కలెక్టరేట్లో సూపరింటెండెంట్, తహశీల్దార్‌గా పనిచేసిన అఖిల ప్రసన్న సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. నారాయణపేటలో జరిగిన కార్యక్రమంలో అఖిల ప్రసన్న దంపతులను సన్మానించి జ్ఞాపిక అందించారు. 40 ఏళ్లుగా అందించిన సేవలను కలెక్టర్ కొనియాడారు.