NRPT: మక్తల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో జింకల బెడదతో పంటలు నష్టపోతున్నాయని భారతీయ కిసాన్ సంఘ్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఐదు మండలాల్లో జింకలు గుంపులుగా వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయని రాష్ట్ర జోనల్ కార్యదర్శి వెంకోబ తెలిపారు. జింకలను సంరక్షణ కేంద్రాలకు తరలించాలని కోరారు.
తెలంగాణ
జింకల బెడద నుంచి పంటలను కాపాడాలని వినతి


