హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలసదనం, వృద్ధాశ్రమం తనిఖీ

NRPT: నారాయణపేటలోని బాలసదనం, వృద్ధాశ్రమాన్ని జూనియర్ సివిల్ జడ్జి సాయి మనోజ్కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టిక, రికార్డులను పరిశీలించి వంటగదిలో ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. బాలలు, వృద్ధులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.