హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీఎంపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి'

BHNG: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మోత్కూరు మండలం దాచారం సర్పంచ్‌ కర్నే జ్యోతి డిమాండ్‌ చేశారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీఎంను అసభ్య పదజాలంతో విమర్శించడం సరికాదన్నారు. వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.