హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి అక్రమ రవాణాలను అడ్డుకున్న గ్రామస్తులు

BHPL: చిట్యాల మండలం గుంటూరు పల్లి శివారులోని బోడ గుట్ట శివారు నుంచి ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మట్టిని తరలిస్తుండగా గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు. జేసీబీల సహాయంతో మట్టిని లారీలలో తరలిస్తుండగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అడ్డుకొని వెనక్కీ పంపించారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.