హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాహుల్ గాంధీపై అక్రమ ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలి: డీసీసీ

MBNR: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను నిరసిస్తూ జడ్చర్ల అంబేద్కర్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను కేసులతో అణచలేరన్నారు. రాహుల్‌ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.