హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే వ్యాఖ్యలకు మాజీ ఎంపీ మాలోత్‌ కవిత ఖండన

MHBD: మహబూబాబాద్‌ మండలం గుముడూరు మహిళలను ‘రెడ్‌ లైట్‌ ఏరియా’గా పేర్కొంటూ ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్‌ చేసిన వ్యాఖ్యలను నేడు మాజీఎంపీ మాలోత్‌ కవిత తీవ్రంగా ఖండించారు. కలెక్టరేట్‌లో బహిరంగంగా మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వారి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.