WGL: నెక్కొండ మండలంలో పలువురు శాస్త్రవేత్తలు సోమవారం పర్యటించారు. ఈ సందర్బంగా దిగొండ, వెంకటాపూర్, అలంఖానిపేట గ్రామాల్లో పత్తి, వరి, పసుపు, కూరగాయ పంటలను పరిశీలించారు. పంటల్లో రోగాలు, పురుగుల ఉద్ధృతిని గుర్తించి నివారణ చర్యలను రైతులకు వివరించారు. పత్తిలో రసం పీల్చే పురుగులు, పిండి నల్లి నివారణ, తెగుళ్ల నివారణ మందులపై రైతులకు సూచనలు చేశారు.
తెలంగాణ
నెక్కొండలో పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు


