హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువతతోనే హెచ్‌ఐవీపై అవగాహన సాధ్యం

అన్నమయ్య: చిన్నమండెం కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో పీసీఎస్‌ఎస్–టీఐ ఎన్‌జీవో ఆధ్వర్యంలో విద్యార్థినులకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెచ్‌ఐవీ వ్యాప్తి, నివారణ, ఏఆర్‌టీ చికిత్స, 1097 టోల్‌ఫ్రీ నంబర్‌పై అవగాహన కల్పించారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిపై వివక్ష చూపరాదని ప్రధానోపాధ్యాయురాలు ఎం.సాయి దివ్య సూచించారు.