హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వర్షాభావంతో బీడు భూములుగా పొలాలు

GDWL: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అలంపూర్‌ మండలంలోని పొలాలు చాలా వరకు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. ఆగస్టు ముగింపు దశకు చేరినా సరైన వర్షాలు కురవక సాగు పనులు మందకొడిగా సాగుతున్నాయి. రైతులు స్వల్పకాలిక పంటల వైపు మొగ్గు చూపాలని వ్యవసాయ అధికారులు సూచించారు. ఇప్పటివరకు మండలంలో 9 వేల ఎకరాల్లో మాత్రమే పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగు నమోదైంది.